రైల్వే కాంక్రీట్ మిల్లర్ లారీ బోల్తా... ఐదుగురు తీవ్ర గాయాలు

అల్లూరి: బొర్రా గుహలు సమీపం కుట్యాసిమిడి గ్రామం రోడ్డు వద్ద రైల్వే డబుల్ ట్రాక్ అండ్ టన్నెల్ పనులు నిర్వహిస్తున్న NL 01A H6620 రైల్వే కాంక్రీట్ మిల్లర్ లారీ ఆదివారం అర్ధరాత్రి కాంక్రీట్ లోడుతో వెళుతూ అదుపుతప్పి బోల్తా కొట్టింది. లారీలో ఉన్న ఐదుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో బయటపడ్డారని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారనీ తెలిపారు.