పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి : డీజీపీ
TG: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎస్పీలకు సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మతపరమైన సమస్యలు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు.