దంచి కొడుతున్న భారీ వర్షం

దంచి కొడుతున్న భారీ వర్షం

WGL: వర్ధన్నపేట పట్టణంలో సోమవారం ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం పడుతోంది. దీంతో వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటితో జలమయం అయ్యాయి. వర్ధన్నపేట చుట్టుపక్క మండలాల గ్రామాల వ్యాప్తంగా ఉన్న రైతులు చాలా రోజుల తర్వాత వర్షం పడుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై డ్రైనేజీ వాటర్ పొంగి ప్రవహిస్తోంది.