సిర్పూర్ (టి)లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

సిర్పూర్ (టి)లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

ASF: సిర్పూర్ (టి) మండలంలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి చలి తీవ్రంగా పెరిగింది. దీనితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం చలి కాచుకుంటుండగా, మరికొందరు స్వెటర్లు ధరించి శరీరాన్ని కాపాడుకుంటున్నారు. చిన్నపిల్లలు,వృద్ధులు,అస్తమా వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.