'ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి'

ELR: ఆగస్టు తొమ్మిదిన ఐటీడీఏ కార్యాలయంలో జరగనున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. సోమవారం బుట్టాయుగూడెం మండలం కొటరామచంద్రపురం ఐటీడీఏలో అధికారులతో సమీక్షించారు. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, జీవన విధానాలపై సమాజంలో విస్తృత అవగాహన అవసరం అన్నారు.