సిసి రోడ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

HNK: కాజిపేట మండలం సోమిడి గ్రామంలో మంగళవారం రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ది పథకాలలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కూడా చైర్మన్ వెంకట్ రామిరెడ్డి, కార్పొరేటర్‌లు రవిందర్ యాదవ్ పాల్గొన్నారు.