రాణిపేటలో 'డ్రైడే-ఫ్రైడే' కార్యక్రమం

రాణిపేటలో 'డ్రైడే-ఫ్రైడే' కార్యక్రమం

MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో 'డ్రైడే-ఫ్రైడే' కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. వర్షాకాలంలో డెంగ్యూ, చికున్ గన్యా వంటి వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ ఆయుబ్ ఖాన్, ఏఎన్ఎంలు రాజేశ్వరి, రాధిక తదితరులు పాల్గొన్నారు.