క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించాలి: ఎమ్మెల్యే

కోనసీమ: క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని మరింతగా ప్రోత్సహించాలని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. మామిడికుదురు మండలం బి. దొడ్డవరం గ్రామ దేవతలు ముత్యాలమ్మ, గోగులమ్మ అమ్మవార్ల జాతరను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలకు ఆదివారం ఎమ్మెల్యే బహుమతులు అందించారు.