దిత్వా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
TPT: దిత్వా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పెళ్లకూరు ఎస్సై నాగరాజు తెలిపారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు క్షేమంగా ఉండాలన్నారు. పూరిల్లు, పాతబడిన ఇంట్లో ఉండి నివాసం ఉంటున్న వారు అవి కూలిపోయే పరిస్థితి ఉంటే వెంటనే స్థానిక సచివాలయంలోకి వెళ్లి సురక్షితంగా ఉండాలన్నారు. సమస్యలు ఉంటే వెంటనే 9440796358 ఈ నంబర్‌కు కాల్ చేయాలన్నారు.