'వేసవిలో క్లాసులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి'

GNTR: వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి AISF జిల్లా కార్యదర్శి యశ్వంత్ రఘువీర్ డిమాండ్ చేశారు. గుంటూరు చంద్రమౌళి నగర్‌లోని కళాశాలలో బ్రిడ్జి కోర్సుల పేరుతో తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలను AISF నాయకులు గురువారం మూసివేయించారు. విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.