శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు ప్రారంభం

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు ప్రారంభం

KNR: తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలోని పెద్ద గుట్టలో వెలసిన శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు మార్చి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మార్చి 3న పంచామృత అభిషేకాలు, గణపతి హోమం, మార్చి 4న కళాశ గణపతి, అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలు స్వామివారు వెలసిన వందేళ్లను పురస్కరించుకుని జరుగుతున్నాయి.