యాగశాలపై కప్పు నిర్మాణ పనులు పూర్తి
కృష్ణా: బాపులపాడు గ్రామంలో దాతల సహకారంతో నిర్మితమైన శివాలయంలో భక్తుల సౌకర్యార్థం వసతుల అభివృద్ధి కొనసాగుతోంది. గత నవంబర్‌లో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఈ ఆలయంలో నిర్మాణ కమిటీ తాజాగా రూ.3 లక్షల వ్యయంతో శాశ్వత యాగశాల నిర్మాణాన్ని చేపట్టింది. సోమవారం యాగశాల పైకప్పు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేశారు.