పాకాలలో శాంతి ర్యాలీ నిర్వహించిన చెవిరెడ్డి

TPT: పాకాలలో చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. పాకాల రైల్వే గేటు నుంచి, రైల్వేస్టేషన్ వరకు వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ జరిగింది. వందేమాతరం, ఉగ్రవాదం నశించాలి, 'జైహింద్..జై జవాన్' అంటూ నినాదాలు చేశారు.