'నిమజ్జనానికి గతేడాది కంటే ఎక్కువ క్రేన్లు'

HYD: ఈ నెల 27న ప్రారంభమై సెప్టెంబర్ 6న పూర్తి కానున్న గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో GHMC ప్రధాన కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యా రు. అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. నిమజ్జనం వేగంగా, సాఫీగా పూర్తి చేసేందుకు గతేడాది కంటే ఎక్కువ క్రేన్లు కూడా ఉపయోగిస్తామని చెప్పారు.