రామాపురం మోడల్ స్కూల్లో మాక్ పోలింగ్
అన్నమయ్య: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగబద్ధ ఎన్నికల నిర్వహణపై నేటి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రామాపురం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్యామలాదేవి మాక్ పోలింగ్ నిర్వహించారు. సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో అదే రీతిలో జరిపించారు. నామినేషన్ల నుంచి క్యాంపెయిన్, ఓటింగ్ విధానం ఇలా ప్రతి విషయాన్ని విద్యార్థులకు తెలిసేలా కార్యక్రమం చేపట్టారు.