కామారెడ్డిలో గాలి వాన బీభత్సం.. వెయ్యి కోళ్లు మృతి

కామారెడ్డిలో గాలి వాన బీభత్సం.. వెయ్యి కోళ్లు మృతి

KMR: మహమ్మద్ నగర్ మండలంలో 2రోజుల క్రితం గాలి వాన బీభత్సానికి చెట్లు, కరెంట్ స్థంభాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో గాలిపూర్ శివారులో ఉన్న వెంకటేశ్‌కు చెందిన పౌల్ట్రీ ఫారానికి రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఫారంలో ఉన్న కోళ్లకు తాగునీరు అందక, ఉక్క పోతకు గురై సుమారు వెయ్యి కోళ్లు శుక్రవారం మృతి చెందినట్లు బాధితుడు వాపోయాడు.