VIDEO: రోడ్డుపై కోతుల గ్యాంగ్ వార్
మేడ్చల్: రోడ్డుపై కోతుల గ్యాంగ్ హాల్ చల్ చేసిన ఘటన పోచారం సర్కిల్ పరిధిలోని ప్రతాపసింగారంలో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ప్రతాపసింగారం ప్రధాన కూడలిలో కోతులు బీభత్సం సృష్టించాయి. రోడ్డు పై కోతులు రెండు వర్గాలుగా ఏర్పడి ఘర్షణకు దిగాయి. కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.