VIDEO: ఘనంగా పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
KKD: తుని గణపతి నగర్ మున్సిపల్ పార్కులో ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహాన్ని వ్యాపారవేత్త చెక్క తాతబాబు, మాజీ MLA రాజా అశోక్ బాబు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ నార్ల భువన సుందరి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధనలో శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు.