VIDEO: కేతకి సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

SRD: దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో సోమవారం స్వామివారికి ఇందువాసరే ప్రభాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం, శుక్లపక్షం విదియ తిథి పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. మహాలింగానికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, మంగళ హారతి ఇచ్చారు.