VIDEO: భారీ వర్షం.. సర్వీస్ రోడ్డు ధ్వంసం
MBNR: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు బుధవారం తీవ్రంగా దెబ్బతింది. రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతల వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారులు నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సర్వీస్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.