కుందూ నదిలో మృతదేహం లభ్యం
NDL: నంద్యాల పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి పుల్లయ్య ఈనెల 19 నుంచి కనబడటం లేదని కుమారుడు ఆదిత్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇవాళ గోస్పాడు మండలం రాయపాడు గ్రామ సమీపంలో ఉన్న కుందూనదిలో పుల్లయ్య మృతదేహం లభ్యమయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు.