రూ.50 లక్షలతో మరమ్మతు పనులు ప్రారంభం

రూ.50 లక్షలతో మరమ్మతు పనులు ప్రారంభం

EG: గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే వాసు ఆరోపించారు. గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న కాంప్లెక్స్‌ మరమ్మతులు చేసేందుకు రూ.50 లక్షలతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేసారు. స్లాబ్‌ లీకేజీలను సరి చేయడం, టాయిలెట్స్‌కు పూర్తిగా మరమ్మతులు చేపడతామన్నారు.