'నల్లమాడలో వేరుసెనగకు రిజిస్ట్రేషన్ చేసుకోండి'

'నల్లమాడలో వేరుసెనగకు రిజిస్ట్రేషన్ చేసుకోండి'

సత్యసాయి: నల్లమాడ మండలంలోని రైతులు విత్తన వేరుశనగ కాయల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వ్యవసాయ అధికారి అబ్దుల్‌ హక్‌ మంగళవారం తెలిపారు. రబీలో వేరుశనగ సాగు చేసే రైతుల కోసం ప్రభుత్వం సబ్సిడీతో 30 కిలోల బస్తా రూ.1,656తో అందిస్తోందన్నారు. పాసుపుస్తకం గల రైతులు రైతుసేవా కేంద్రాల్లో అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల వద్ద ఆధార్‌ నమోదు చేయించుకోవాలని తెలిపారు.