కాశీబుగ్గ ఘటన పక్కదారి పట్టించేందుకే జోగి రమేశ్ అరెస్ట్: బొత్స
SKLM: పలాస ఆస్పత్రిలో తొక్కిసలాట ఘటన బాధితులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాశీబుగ్గ ఘటనను పక్కదారి పట్టించేందుకే జోగి రమేశ్‌ను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తొక్కిసలాటలు మూడుసార్లు జరిగాయని బొత్స తీవ్రంగా విమర్శించారు.