'కూటమి నిర్ణయం చారిత్రకమైనది'
ELR: కలిదిండి జడ్పీ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ.. బడి పిలుపు - వికసిత్ ఆంధ్రకు మలుపు అనే కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్వహించిందన్నారు.