'అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు'
సిరిసిల్ల: అక్రమ కట్టడాలపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఏఐఎఫ్టీయూ (న్యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. సిరిసిల్లలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సిరిసిల్ల నుంచి తాడూరు వెళ్లే దారిలో అక్రమంగా అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారన్నారు. దీనిపై చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు.