VIDEO: 'ఫీజుల వేధింపులే ప్రాణం తీశాయి'

VIDEO: 'ఫీజుల వేధింపులే ప్రాణం తీశాయి'

SDPT: శివారులోని ఓ మెడికల్ కళాశాల వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని శ్రీజ కుటుంబ సభ్యులు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. యాజమాన్యం ఫీజుల పేరుతో వేధించడం వల్లే తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడిందని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించారు.