పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోండి : ఎస్పీ

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోండి : ఎస్పీ

MBNR: భూత్పూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ జానకి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందించే సేవలలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలతో మర్యాదగా, బాధ్యతగా నడుచుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు భూత్పూర్ సీఐ పాల్గొన్నారు.