జిల్లా కలెక్టర్‌ను కలిసిన మేయర్
KNR: నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రాను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, నగర సమస్యలపై కలెక్టర్‌తో చర్చించినట్లు వారు పేర్కొన్నారు.