బెంగాలే బీజేపీ తదుపరి లక్ష్యం: మోదీ
పశ్చిమ బెంగాల్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'గంగా నది బీహార్ గుండా ప్రవహించి బెంగాల్ చేరుకుంటుంది. అదే విధంగా బెంగాల్‌లో బీజేపీ విజయానికి బీహార్ మార్గం సుగమం చేసింది. బెంగాల్ ప్రజలకు నా అభినందనలు. ఇప్పుడు బీజేపీ మీతో కూడా కలిసి పశ్చిమ బెంగాల్ నుంచి జంగల్ రాజ్‌ను నిర్మూలిస్తుంది' అంటూ తదుపరి లక్ష్యం బెంగాల్ అని మోదీ స్పష్టం చేశారు.