హైవోల్టేజ్‌తో గృహోపకరణాలు దగ్ధం

NLG: చిట్యాల పదో వార్డులో గురువారం సాయంత్రం హై ఓల్టేజ్ వల్ల పలు ఇండ్లలో పరికరాలు దగ్ధమయ్యాయి. గోవర్ధన్ ఇంట్లో నీళ్ల మోటారు కు అకస్మాత్తుగా మంటలు వచ్చి కాలిపోయింది. 1వ నంబర్ రేషన్ షాపులో వేలిముద్రలు వేసే మిషన్ కాలిపోయింది. పలువురి ఇండ్లలో కూడా గృహోపకరణాలు కాలిపోగా నేతలు చికిలమెట్ల అశోక్, గుండాల నరేష్ గౌడ్ బాధితుల ఇండ్లను శుక్రవారం సందర్శించారు.