ఢిల్లీ సదస్సుకు కొత్తూరు సర్పంచ్‌కు ఆహ్వానం

AKP: నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈనెల 15న జరిగే సదస్సుకు అనకాపల్లి మండలం కొత్తూరు సర్పంచ్ ఎస్. లక్ష్మీప్రసన్నకు ఆహ్వానం అందింది. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 75 మంది సర్పంచులను సదస్సులకు ఆహ్వానించగా ఏపీ నుంచి ఆరుగురు ఉన్నారు. వారిలో కొత్తూరు సర్పంచ్ ఒకరు కావడం విశేషం. ఈ మేరకు ఆమె ఆదివారం బయలుదేరి సదస్సుకు వెళ్లనున్నారు.