లంచం అడిగితే ఈ నంబర్‌కి ఫోన్ చెయ్యండి
విశాఖ: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవకులుగా, నిజాయితీగా పని చేయాలని ACB డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి సూచించారు. జీతం తీసుకుంటున్న ప్రతి అధికారి భక్తితో విధులు నిర్వర్తించడం తమ బాధ్యత అని చెప్పారు. లంచం కోరితే భయపడకుండా వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.