కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు
జగిత్యాల జిల్లా ధర్మపురిలో కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆఫ్సరీ బేగం (72)ను ఆమె కొడుకులు పోషించకుండా ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తన భూములు తీసుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. ఆర్డీవో కార్యాలయాన్ని ఆశ్రయించిన ఆమె, కుమారుల నుంచి భృతి ఇవ్వాలని, తన ఇల్లు తిరిగి ఇవ్వాలని కోరింది. ఈ మేరకు అధికారులు కేసు నమోదు చేశారు.