క్వింటా పత్తి ధర రూ. 7660

క్వింటా పత్తి ధర రూ. 7660

వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురిచేస్తున్నాయి. కాగా, బుధవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. నిన్న క్వింటా రూ.7,675 ధర పలకగా.. ఈరోజు రూ.15 తగ్గి.. రూ.7,660 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్‌లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.