VIDEO: అజార ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..!

VIDEO: అజార ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..!

WGL: జిల్లా కేంద్రంలోని అజార ఆసుపత్రి వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు హాస్పిటల్ లోపల మృతదేహాన్ని ఉంచి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడు పరకాల పట్టణంలోని రాజ్‌పేట గ్రామానికి చెందిన తోట రవిగా బంధువులు తెలిపారు. రోగి చికిత్సలో నిర్లక్ష్యం జరగడంతో మృతి చెందినట్లు ఆరోపించారు.