మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా కట్టాల్సిందే

SKLM: పలాస పరిధిలో ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మంది వాహన చోదకులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 90 వేలు అపరాధ రుసుమును వేస్తూ... పలాస కోర్టు సివిల్ జడ్జ్ యు మాధురి తీర్పు వెల్లిడించింది. రెండోసారి మద్యం సేవించి పోలీసులకు చిక్కిన ఎడల మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు.