నగరంలో పెరుగుతున్న విడాకుల సంఖ్య

HYD: పెళ్లి చేసుకున్న కొంత కాలానికే విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య HYDలో పెరుగుతోంది. పెళ్లైన ఏడాదిలోపే విడాకులు కోరే జంటలు 60 శాతం ఉన్నాయని నిపుణులు చెప్పారు. అందులో 25 నుంచి 35 మధ్య వయసున్న జంటలే ఎక్కువని తెలిపారు. అయితే పెళ్లికి ముందే భవిష్యత్ ప్రణాళిక లక్ష్యాలను చర్చించుకోవాలని.. అనవసర విషయాల్లో పెద్దల జోక్యం ఉండకూడదన్నారు.