VIDEO: ఏనుగు దాడిలో హైవే కూలీకి గాయాలు
CTR: చెన్నై - బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చేస్తున్న ఓ కూలీపై ఏనుగు దాడి చేయడంతో గాయపడ్డ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే గాంధీనగర్ సమీపంలో యూపీకి చెందిన గణేష్ యాదవ్ పనిచేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఏనుగు ఆయనపై దాడి చేసింది. ఇది గమనించిన సహచరులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.