VIDEO: తేమ శాతం తగ్గించేందుకు రైతుల కష్టాలు..!
ELR: తడిచిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలని భీమడోలుకు చెందిన రైతులు కోరుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో రోజులు తరబడి వర్షం కురుస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తేమశాతం తగ్గించడానికి ధాన్యం ఆరబెడుతున్నామని, వర్షానికి తడవడంతో అదనంగా మరిన్ని రోజులు ఆరబెట్టాల్సి వస్తుందంటున్నారు. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.