భారత్‌కు రష్యా చమురు నౌక.. కేంద్రం స్పందన
చైనాకు వెళ్తున్న చమురు నౌక భారత్ వైపు మళ్లిందని వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. అక్వా టైటాన్ అనే రష్యన్ ట్యాంకర్‌కు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ తెలిపారు. సదరు నౌక ఈ నెల 21న కర్ణాటకలోని న్యూ మంగళూరుకు చేరుకుంటుందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.