తెనాలిలో విద్యార్థులకు నృత్య పోటీలు

GNTR: నృత్య విద్యార్థులను ప్రోత్సహించడానికి తెనాలిలో శనివారం నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు డాక్టర్ జీవనలత తెలిపారు. కొత్తపేటలోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గ్రూప్ డ్యాన్స్ పోటీలు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థినులకు పోటీలు ఉంటాయన్నారు.