చౌడేశ్వరి దేవి ఆలయంలో పల్లకి సేవ

NDL: బనగానపల్లె మండలం, నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు భక్తులు పల్లకి సేవలు వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారిని ఆలయ అర్చకులు ప్రత్యేక పూలమాలలతో అలంకరించి విశేష పూజలను అందించారు. అనంతరం చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.