కానూరులో భారీ మోసం

కానూరులో భారీ మోసం

కృష్ణా: కానూరుకి చెందిన యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి ఆన్‌లైన్ మోసానికి గురై రూ.55.20 లక్షలు కోల్పోయాడు. యాక్సిస్ బ్యాంక్ ఏజెంట్లమని చెప్పిన వ్యక్తులు వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి ELITE OTC VAULTలో పెట్టుబడులు పెట్టించారు. మొదట రూ.22.20 లక్షలు పెట్టించిన వారు, నకిలీ లాభాలు చూపించి ప్రాసెసింగ్, సర్వీస్ ఛార్జీల పేరుతో మరింత డబ్బు వసూలు చేశారు.