నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
వనపర్తి పాలిటెక్నిక్ 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టీజీఎస్పీడీసీఎల్ ఏఏఈ సుధాకర్ తెలిపారు. 8 ఎంవీఏతో పాటు అదనంగా 1x5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయనున్నందున ఈ అంతరాయం కలుగుతుందన్నారు. సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని కాలనీల ప్రజలు సహకరించాలని కోరారు.