వైఎస్ జగన్‌కు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్

వైఎస్ జగన్‌కు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో పెట్టుబడులు, సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. జగన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అప్పుల సృష్టికర్త జగన్ అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.