నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
PLD: చిలకలూరిపేటలో విద్యుత్ సబ్ ష్టెషన్ ఫీడర్ మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ADE అశోక్ కుమార్ తెలిపారు. పట్టణంలోని టౌన్ -2 పరిధిలో కృష్ణారెడ్డి డొంక, కుమ్మర కాలనీ, ఎన్నార్టీ సెంటర్ నుంచి ఏఎంజీ వరకు సరఫరా ఉండదన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల ఉంటుందని పేర్కొన్నారు.