నసురుల్లాబాద్‌లో పోచమ్మకు ప్రత్యేక పూజలు

KMR: జిల్లాలోని నసురుల్లాబాద్ మండల మైలారంలో మంగళవారం పోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి మెుక్కులు చెల్లించుకున్నారు. తమ పంటలను పురుగుల బారి నుంచి రక్షించమని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.