జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మీసాల సుమలత నియామకం

జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మీసాల సుమలత నియామకం

కర్నూలులో స్వచ్ఛంద సేవకురాలు మీసాల సుమలత వంద కుటుంబాలతో కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు సుమలతను జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించారు. మహిళా కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేస్తానని సుమలత తెలిపారు.