సింగారంలో గ్రామస్థులకు చట్టాలపై అవగాహన

సింగారంలో గ్రామస్థులకు చట్టాలపై అవగాహన

నారాయణపేట మండలం సింగారంలో శుక్రవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్థులకు చట్టాలపై అవగాహన కల్పించినట్లు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మీపతి గౌడ్ తెలిపారు. బాల్య వివాహాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టాలు, గృహ హింస, అదనపు కట్నం వేధింపులు వంటి చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.